![]() |
![]() |

అనసూయ కొద్ది రోజులుగా ఆన్లైన్ లో వేధించే వాళ్ళ మీద గట్టిగానే ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే కొంత కాలం క్రితం ఆంటీ అని పిలుస్తూ ట్విట్టర్ వేదికగా కొంతమంది నెటిజన్స్ అనసూయని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈమె ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. వీళ్ళ మీద సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు కూడా చేసినప్పటికీ ఆమెపై వేధింపులు ఆగలేదు. ఐతే అనసూయ పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని అబ్యూజ్ కామెంట్స్ చేసిన ఒక వ్యక్తి మీద అనసూయ ఈ నెల 17 న సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేశారు. ఇక ఇప్పుడు ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇతను కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన పండరి రామవెంకట వీర్రాజుగా గుర్తించారు. సాయి రవి 267 అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా యాంకర్స్ ని, యాక్టర్స్ ని టార్గెట్ చేసి అబ్యూజ్ చేస్తున్నాడు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వేదికగా సెలబ్రిటీస్ ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనసూయ, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ, ప్రగతి, జయవాణి వంటి సెలబ్రిటీల ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి అభ్యంతరకర కామెంట్స్ చేస్తున్నట్లు తెలిపారు.
![]() |
![]() |